సీఐడీ నోటీసులపై టీడీపీ స్టెప్ ఇదే…
ఆంధ్రప్రదేశ్ లో పెనుదుమారం రేపుతున్న విషయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సిఐడి నోటీసులు ఇవ్వడం. తాజాగా సీఐడీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ నోటీసులపై ఈరోజు చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. సిఐడి ఇచ్చిన నోటీసులపై విచారణకు వెళ్లకూడదని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.
అదేవిధంగా సిఐడి నోటీసులపై ఒకట్రెండు రోజుల్లో కోర్టును ఆశ్రయించాలని కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసు కొట్టివేత కోసం క్వాష్ పిటిషన్ వేసే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. అరెస్టులు లేకుండా విచారణ జరిగేలా కోర్టును ఆశ్రయించే యోచనలో టీడీపీ ఉండటం విశేషం. కాగా దళితుల తరపున అంటూ ఎమ్మెల్యే పెట్టిన సిఐడి కేసు నిలవబోదని టీడీపీ నేతలు ఓ పక్క చెప్తున్నా మరోపక్క తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చురుకుగా తీసుకొనే పనిలో నిమగ్నమైంది టీడీపీ.