సీఎం జగన్ కు వైసీపీ సర్పంచ్ అభ్యర్థి ఆవేదనతో లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కర్నూలు జిల్లా దేవనకొండ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి ఆవేదనతో కూడిన లేఖను రాశారు. వైసీపీ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేయించి వైసీపీ నేతలు తమను మోసం చేశారంటూ అభ్యర్థి గీత సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అదేమంటే… ఎన్నికల ఖర్చు భరిస్తామని చెప్పి ఖర్చంతా తనతో పెట్టించి చివరికి ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చారని తీవ్రమైన ఆరోపనలు గుప్పించారు. తాను సుమారు రూ.15 లక్షలకు పొలం తాకట్టు పెట్టానని, అప్పులు చేశానని, సర్పంచ్ ఎన్నికలకు మొత్తంగా 40 లక్షలు ఖర్చయింది అని అందుకోసం 31 లక్షల వరకు అప్పుజేసి ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆవేదనకు లోనయ్యారు. ఇంకా 7 లక్షలు అప్పు మిగిలిందని అన్నారు. కాగా న్యాయం చేయాలని, లేని పక్షంలో తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని లేఖలో వివరించారు.
అంతేకాకుండా ఈ దేవనకొండ మేజర్ పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎస్సీలకు రిజర్వ్ చెందిన స్థానంలో సర్పంచ్ గా వైసీపీ మద్దతుతో గీత పోటీ చేసి ఓడిపోయింది. వ్యవసాయం చేసుకునే దాన్ని ఎన్నికల్లో దించారని, చివరికి స్థానిక వైసీపీ నేతలు మోసం చేసి ఓడించారని సీఎం జగన్ కు ఆవేదనతో గీత లేఖ రాశారు. ఎన్నికల్లో పోటీకి ముందు స్థానిక వైసీపీ నేతలు, అభ్యర్థి భర్త హంపయ్య కు మధ్య స్టాంప్ పేపర్ పై అగ్రిమెంట్ రాసుకున్నారు. ఎన్నికల్లో ఎంత ఖర్చయినా తానే భరిస్తానని, అందుకు అభ్యర్థి భర్తకు చెందిన మూడు ఎకరాల భూమి స్థానిక వైసీపీ నేత పేరుతో విక్రయ దస్తావేజు రాసిచ్చేలా ఒప్పందం కుదిరిందని కూడా వివరించారు. స్థానిక వైసీపీ నేతల మోసం కారణంగా తాను బలి అయ్యానని ఆదుకోకుంటే మాకు ఆత్మహత్యే దిక్కు అని కూడా గీత సీఎంకు రాసిన లేఖలో వాపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *