సారంగ దరియా @50 మిలియన్ వ్యూస్ క్రాస్

టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న తాజా సినిమా లవ్ స్టోరి. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. లవ్ స్టోరిలో ఒక్కో పాట ఒక్కో ఆణి ముత్యంగా నెట్టింట్లో దుమ్మురేపుతుంది. రెండు వారాల కిందట రిలీజ్ చేసిన ‘సారంగ దరియా’ పాట ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ క్లబ్ లో చేరిపోవడం సినిమా యూనిట్ ని ఆశ్చర్యంలోకి ముంచెత్తుతుంది.
అయితే ఫిబ్రవరి 28న సమంత చేతుల మీదుగా విడుదలైన సారంగ దరియా పాట కేవలం 14 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకుంది. సాయి పల్లవి చేసిన పాట రౌడీ బేబీ ఒక్కటే 8 రోజుల్లో ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ కు రీచ్ అయి సారంగ దరియా కంటే ముందుంది. మిగతా సూపర్ హిట్ సాంగ్స్ బుట్ట బొమ్మ, రాములో రాములా పాటలు సారంగ దరియా స్పీడ్ కంటే వెనకబడటం విశేషం. బుట్ట బొమ్మ పాటకు 50 మిలియన్ వ్యూస్ వచ్చేందుకు 18 రోజులు పట్టగా, రాములో రాములా పాటకు 27 రోజులు పట్టింది.
కాగా సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించిన సారంగ దరియా పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగా ఆకట్టుకుంటుంది. పవన్ సీహెచ్ సంగీతం ఈ తెలంగాణ జానపద గీతానికి అద్భుతంగా కుదిరింది. మంగ్లీ గొంతులో పలికిన మరో సూపర్ హిట్ సాంగ్ సారంగ దరియా. ఇన్ని స్పెషల్స్ తో ఏప్రిల్ 16న ‘లవ్ స్టోరి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *