సలార్ లో విలన్ గా జాన్ అబ్రహం…!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ లో అలరించనుంది అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
అయితే ఈ మధ్య సెట్స్ పైకి వెళ్లిన ‘సలార్’ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కోవిడ్ మహమ్మారి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కాస్త తగ్గిన తర్వాత మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. అసలు విషయానికొస్తే… ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ ను ఢీకొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సలార్ లో విలన్ గా నటించే విలన్ ఎవరు అంటే జాన్ అబ్రహం. పాన్ సినిమా కావడంతో, సలార్ లో నటించడానికి జాన్ అబ్రహం కూడా అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంకా ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.