సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటో తిరుపతిలో చూపిస్తాం

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఉపఎన్నిక రాజకీయ పార్టీ నేతల మధ్య హీట్ ను పెంచుతుంది. పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు తిరుపతి ప్రచారంలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో.. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం నిర్వహించిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. ఆయన మాట్లాడుతూ… అసలు సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటో అది ఎలా ఉంటుంది అనేది ఇప్పడు చేతల్లో చూపిస్తామని అన్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో రత్నప్రభ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. అసలు ప్రత్యేక హోదా గురించి ప్రజలు ఆలోచిస్తారని తాను అనుకోవడం లేదని.. హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని శాసనసభలో తీర్మానం కూడా చేశారని ఆయన గుర్తు చేయడం విశేషం.
అదేవిధంగా తిరుపతిలో అధికార వైసీపీ దెబ్బ తినబోతోంది అని ఆయన వివరించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ లక్ష మెజార్టీ వస్తుందని చెప్పిందని.. కానీ ఓటమిని చవిచూసింది.. తిరుపతిలో కూడా తమకు 5 లక్షల మెజార్టీ అంటూ అధికార వైసీపీ చెప్పినా.. దుబ్బాక ఫలితమే ఇక్కడ రిపీట్ అవుతుందని అధాకార పార్టీ నాయకుల వ్యాఖ్యలు అహంకారంతో చేసినవనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ రణరంగం నుంచి టీడీపీ తప్పుకుందని, ఏపీలో బీజేపీ మాత్రమే వైసీపీకి ప్రత్యామ్నాయం అంటూ ఆయన వివరించారు. కాగా వైసీపీకి ఓటు వేస్తె సంఖ్య పెరుగుతుంది తప్ప.. ఎలాంటి ఉపయోగం లేదని అధికారంలో ఉండి ప్రశ్నించలేని పార్టీకి ఓటెందుకు అంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ప్రశ్నాస్త్రాన్ని సంధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *