షాక్ తెప్పిస్తోన్న రాజ్ కుంద్రా లీలలు… !

టాలీవుడ్ లో ‘సాగరకన్య’గా ఓ వెలుగు వెలిగిన శిల్పా శెట్టి అనూహ్యంగా ఇబ్బందుల్లో ఇరుక్కుంది. ఆమె భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు. పైగా ఆయన మీద నమోదైన కేసు అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రదర్శనకి సంబంధించింది కావటంతో అందరూ షాక్ కి గురౌతున్నారు. అయితే.. ఈ వివాదంలో కంప్లైంట్ ఫిబ్రవరీలోనే నమోదైంది. కానీ.. అరెస్ట్ మాత్రం జూలై 19వ తేదీన రాత్రి వేళ జరిగింది. భర్త అరెస్టుతో శిల్పా శెట్టి ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి దాపురించడం జీర్ణించుకోలేని విషయం.
ఇదిలా ఉండగా… ఆశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన రాజ్కుంద్రా వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన హాట్ హిట్ యాప్ నుంచి వస్తున్న ఆదాయం చూసి పోలీసులే నివ్వెరపోతున్నారు. అలాగే బాలీవుడ్లో అవకాశాల కోసం వచ్చిన మోడల్స్ ను పోర్న్ మూవీస్లో నటించాలని కుంద్రా ఒత్తిడి చేసేవాడని కూడా దర్యాప్తులో వెల్లడౌతుంది.

అంతేకాకుండా అశ్లీల చిత్రాల కంపెనీ పెట్టి, రోజుకు లక్షలు గడిస్తున్న రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో రాజ్ కుంద్రా బ్యాంకు అకౌంట్స్ వివరాలు బయటపడ్డాయి. మొత్తానికి ఈ వ్యాపారం ద్వారా కుంద్రా రోజుకు లక్ష నుంచి పది లక్షలు సంపాదిస్తున్నట్లు స్పష్టమౌతుంది. మరి ఈ కేసులో ముందు ముందు మరెన్ని విషయాలు వెలుగు చూస్తాయో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *