షటిల్ ఆడుతూ ఏపీ సీఐ ఆకస్మిక మృతి…

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీఐ హఠాత్తుగా షటిల్ ఆడుతూ చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భగవాన్ ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. రోజూ షటిల్ ఆడటం ఆయన అలవాటు. ఎప్పటివలెనే గణపవరం పోలీస్ స్టేషన్ సమీపంలో షటిల్ ఆడేందుకు వెళ్లారు.

అయితే షటిల్ ఆడుతూ ఉండగా ఆట మధ్యలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి క్రీడాకారులు ఆయనను పక్కకి తిప్పి గుండె పోటు అని భావించి ఒక్కసారిగా రిలీఫ్ ఇచ్చేందుకు నొక్కారు. అప్పటికే ఆయన నిర్జీవంగా పడిపోయారు. దీంతో వెంటనే సీఐను గణపవరంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ.. మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే సీఐ భగవాన్ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనతో సీఐ భగవాన్ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. అటు సీఐ మృతదేహాన్ని ఎమ్మెల్యే వాసుబాబు సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *