శిల్పాకు స్టార్స్ భారీ మద్దుతు…!

బాలీవుడ్ హీరోయిన్ శిల్పా భర్త రాజ్ కుంద్రా ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం భర్త వ్యవహారంలో శిల్పా ఎదుర్కొంటోన్న చిక్కులు అన్నీ ఇన్నీ కావు. పోలీసుల దర్యాప్తులు, కోర్టుల విచారణలే కాకుండా.. మీడియా, సొషల్ మీడియా రాద్ధాంతం కూడా తోడై ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. శిల్పా భర్త అరెస్ట్ తర్వాత మొదటిసారి విపులంగా స్పందించింది. వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తాను ఏం మాట్లాడనని మరొక్కమారు తేల్చి చెప్పిన మిసెస్ కుంద్రా ముంబై పోలీస్, భారతీయ న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపింది. తాను అనని మాటల్ని ప్రచారం చేయవద్దని కూడా కోరిన ఆమె.. అన్నిటికంటే ముఖ్యంగా, ఒక తల్లిగా తన పిల్లల కోసం అభ్యర్థిస్తున్నానని వెల్లడించింది. కాగా ‘ప్రైవెసీ’కి విలువ ఇవ్వమంటూనే.. మీడియా తప్పుడు కథనాలు, సొషల్ మీడియా ట్రోలింగ్ ని ఆమె తీవ్రంగా ఖండించింది.

అదేవిధంగా శిల్పా శెట్టి సొషల్ మీడియాలో స్పందించటంతో చాలా మంది సినీ సెలబ్స్ ఆమెకు అండగా కామెంట్స్ చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తూనే మీడియా ట్రయల్, ట్రోలింగ్ లాంటివి మంచిది కాదని అందరూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారేమంటున్నారంటే… ‘నువ్వు అత్యంత శక్తివంతమైన దానివు’ అని మాధవన్ అంటూ.. శిల్పా తప్పకుండా అన్ని సవాళ్లని గంభీరంగా ఎదుర్కుంటుందని అభిప్రాయపడ్డాడు. నటి రిచా చద్దా ‘మగవాళ్లు చెసే తప్పులకి ఆడవాళ్లని నిందించటం మనకు ఆటగా మారింది. అలాంటి వార్ని శిల్పా కోర్టుకు ఈడుస్తుండటం సంతోషించాల్సిన విషయం…’ అంది. మాధవన్, రిచా చద్దా మాత్రమే కాకుండా షమితా శెట్టి, హన్సల్ మెహతా, వరుణ్ ధావన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, గౌహర్ ఖాన్, అభిమన్యు దస్సాని, మాహీ విజ్, అనిరుధ్ దవే… ఇలా చాలా మంది శిల్పాకు మద్దతుగా నిలిచిన వారిలో ఉన్నారు. కాగా శిల్పా శెట్టి ఓ వైపు మీడియా, సొషల్ మీడియాను మౌనంగానే భరిస్తూ.. భర్త రాజ్ కుంద్రా విడుదల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *