శారదా పీఠంలో సీపీఐ నారాయణ…

ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వింతలు, ఎన్నడూ చూడని విపరీతాలు చోటుచేసుకుంటున్నాయి. అదేమంటే.. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విశాఖపట్టణంలోని శారదాపీఠంలో స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. నిజానికి ఆయన ఏం చేసినా సంచలనమే. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన కార్యక్రమాలు చాలా వైరల్ అవుతుంటాయి.
నారాయణ కరుడుగట్టిన కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తినని చెప్పుకుంటారు. కానీ ఈ మధ్య అదేంటో ఏపీలో ముఖ్యంగా తద్విరుద్ధమైన కార్యకలాపాలను నెరపుతూ కమ్యూనిస్ట్ లనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. పేదలకోసం పరితపిస్తున్న ఏపీ ప్రభుత్వంపై టీడీపీతో కలిసి ఆటంక వాద శక్తిగా మారడం విస్మయానికి గురి చేస అంశంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. జీవీఎంసీలో ఆయన సీపీఐ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. 97వ వార్డు అభ్యర్తి యశోద తరపున చిన మూషిడివాడలో ప్రచారం చేసిన ఆయన.. అక్కడే ఉన్న విశాఖ శారదా పీఠాన్ని కూడా సందర్శించారు. తమ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించిన నారాయణ.. పనిలో పనిగా స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.
కాగా శారదా పీఠంలో నారాయణ ప్రత్యక్షం కావడంలో పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇలాంటి విషయాలకు నారాయణ మినహాయింపు అనే చెప్పాలి. గాంధీ జయంతి రోజు చికెన్ తిని.. ఏడాది పాటు చికెన్ తినడం మానేసిన వ్యక్తి నారాయణ. తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా ఆయన దర్శించుకున్నారు. అదేంటి అని ప్రశ్నిస్తే.. చాలాసార్లు తిరుమలకు వచ్చా.. కానీ.. శ్రీవారిని దర్శించుకోలేదు.. కానీ.. ఇప్పుడు కుటుంబసభ్యులు బలవంతం చేయడంతో ఈసారి తప్పలేదని కితాబిచ్చాడు ఈ కమ్యూనిస్ట్ నేత. మొత్తానికి నారాయణ శారద పీఠ సందర్శన మాత్రం ఏపీ పొలిటికల్ సర్కిల్ లో దుమారం రేపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *