వ్యాక్సిన్ తీసుకున్నా.. ప్రముఖ నటి నగ్మాకు కరోనా…

దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది. రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఓ పక్క కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ వైరస్ అందరికి సోకుతోంది.
ముఖ్యంగా రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడారంగంలోనూ ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే.. కరోనా బారిన పడి చాలా మంది కోలుకున్నారు. విచిత్రంగా ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ… కరోనా సోకుతుంది. దీంతో అందరిలోనూ కలవరం మొదలైంది. తాజాగా.. ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత నగ్మాకు కరోనా పాజిటివ్గా తేలింది. నగ్మా ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఏప్రిల్ 2న ఆమె ముంబైలో కరోనా ఫస్ట్ డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే… కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా.. తాజాగా నగ్మా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉండి వైద్యుల సూచల మేరకు చికిత్స తీసుకుంటున్నారు. మొత్తానికి ఇలా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా వస్తుండటంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *