వైసీపీ అధ్యక్ష పదవికి గట్టు రాజీనామా
తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోరాటాలు చేయడం లేదని, అంతగా క్రియాశీలకంగా లేదని ఆయన ఆ పార్టీ అధ్యక్షపదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అయితే తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తనకు 2007వ సంవత్సరం నుంచి తెలుసని.. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పుకొని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత హుజూర్ నగర్ లో తనను స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారని, ఆ తర్వాత తనపై నమ్మకంతో తెలంగాణ వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారని వెల్లడించారు.
అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణలో వైసీపీ ఎలాంటి పోరాటాలు చేయడం లేదని, క్రియాశీలంగా లేదని ఆరోపణలు రావడంతో తాను పార్టీకి రాజీనామా చేసినట్టు గట్టు శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా తాను భవిష్యత్తులో హుజూర్ నగర్ నుంచి ఓ జాతీయ పార్టీ తరపున పోటీ చేస్తానని గట్టు శ్రీకాంత్ రెడ్డి వివరించారు. మరి ఆయన ఏ జాతీయ పార్టీలో చేరుతారు అనే విషయం తెలియాలంటే ఆయన ప్రకటించేంతవరకు వేచి ఉండాల్సిందే.