వైద్య పరీక్షల కోసం అమెరికాకు రజనీకాంత్…

సూపర్ స్టార్ రజనీకాంత్ వైద్య పరీక్షల కోసం ఈరోజు ఉదయం అమెరికా బయలుదేరారు. అయితే మే 2016లో రజినీకి మూత్రపిండాల వ్యాధి కారణంగా… అమెరికా రోచెస్టర్లోని మాయో క్లినిక్లో నిపుణుల బృందం కిడ్నీ మార్పిడి చేశారు. ఆ తర్వాత నుంచి ఆయన యునైటెడ్ స్టేట్స్ లోని అదే ఆసుపత్రిలో వరుసగా వార్షిక వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కరోనా ప్రబలడంతో రజినీకాంత్ యునైటెడ్ స్టేట్స్ వెళ్ళలేకపోయారు. ప్రస్తుతం కాస్త కరోనా తగ్గుమఖం పట్టడంతో రజినీకాంత్ అమెరికా వెళ్ళేందుకు రెడీ అయ్యారు.
అందులో భాగంగా రజినీకాంత్ ఈరోజు ఉదయం అమెరికా బయలుదేరినట్లు తెలుస్తోంది. ఖతార్ ఎయిర్లైన్స్ ద్వారా చెన్నై నుండి దోహా వరకు చేరుకొని అక్కడి నుండి మరొక విమానం ద్వారా అమెరికాకు చేరుకోనున్నారు. అయితే ఆయనతో పాటు భార్య లతా రజనీకాంత్ కూడా ఉన్నారు. రోజినెస్టర్లోని మాయో క్లినిక్లో రజనీకాంత్ రొటీన్ మెడికల్ చెకప్ చేయించుకోనున్నారు. అమెరికాలో రజినీకాంత్ ను అతని కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్, మనవరాళ్లు కలవనున్నారు. కాగా ‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ కోసం ఇప్పటికే అమెరికా వెళ్లిన ధనుష్ కరోనా వ్యాప్తి కారణంగా అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. అలాగే మెడికల్ చెకప్ తర్వాత మూడు వారాల పాటు యుఎస్లో ఉండి, వారంతా రజినితో కలిసి చెన్నైకి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *