వైఎస్ షర్మిల పార్టీని స్వాగతించిన పవన్ కల్యాణ్..
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్తపార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణలో షర్మిల పార్టీకి స్వాగతం తెలిపిన పవన్ కల్యాణ్… ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలని అన్నారు. ప్రజలకు మంచి చేయడానికి ఎవరొచ్చినా స్వాగతించాలని… 2007 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని పవన్ పేర్కొన్నారు.
అలాగే తెలంగాణ ఉద్యమ గడ్డ అని వెల్లడించిన పవన్.. కొత్త రక్తం, చైతన్యవంతమైన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జనసేన తరఫున వారిని గుర్తించి మద్దతిచ్చామని చెప్పారు పవన్. పార్టీ నిర్మాణం చాలా కష్టమని… తాను పగటికలలు కనే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. రాజకీయ వారసత్వంతో సంబంధం లేని వారు కూడా రాజకీయాల్లోకి రావాలని కోరారు పవన్. కాగా.. ఈరోజు సాయంత్రం వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే.