వైఎస్ జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఒక్కసారి తరచి చూస్తే.. దేశ ప్రజానీకమంతా జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి. తాజాగా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలోని వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జగన్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు కూడా సీఎం వైఎస్ జగన్ సమక్షంలోనే చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించే అంశంగా చెప్పవచ్చు. వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి దేశంలోని పేదలందరూ జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారని పార్థసారథి అన్నప్పుడు అక్కడే ఉన్న వాలంటీర్లు, అభిమానులు కేకలు, అరుపులతో రచ్చ రచ్చ ముచ్చటగా జరిగింది. దీనిపై వైఎస్ జగన్ మాత్రం తన ప్రతిస్పందనను చిరునవ్వుల రూపంలో వ్యక్త పరచడం విశేషం.
అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని చంద్రబాబుపై సెటైర్లు వేశారు. అదేమంటే… 2 లక్షల 50 వేల పైచిలుకు వాలంటీర్లను చూసి చంద్రబాబు కుళ్లుకుంటున్నారని.. జగన్ సైన్యం వాలంటీర్లు పని చేస్తున్న ఆ దెబ్బకు స్పూడ్ కు సర్వర్లు హ్యాంగ్ అయిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. అలాగే తాను, పార్థసారథి గతంలో మంచి స్నేహితులం… ఇప్పుడు జోరు తగ్గిందని అన్న ఆయన.. తనను, పార్థసారథిని కలుపుతూ పిట్ట కథ కూడా చెప్పారు. కాగా జీతాలు పెంచాలన్న కొంత మంది వాలంటీర్ల ఆందోళనను మంత్రి పేర్ని నాని పరోక్షంగా ప్రస్తావించడం విశేషం.