వైఎస్ జగన్ ను జాంబిరెడ్డిగా పిలిచిన లోకేష్

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం వైఎస్ జగన్ పై నారా లోకేష్ విరుచుకు పడ్డాడు. అలాగే జగన్ కు కొత్త పేరు కూడా పెట్టాడు.
ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ రెడ్డి పేరు ఇక నుంచి జాంబీ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీలో ఉన్నవారికి సంక్షేమం, అభివృద్ధి చేస్తే ఆనందం వస్తుందని.. కానీ… జాంబీ రెడ్డి.. టిడిపి నేతలు, కార్యకర్తల అరెస్టులతో ఆనందిస్తున్నారని విరుచుకుపడ్డాడు. మాపార్టీ వారిపై కేసులు, అరెస్టులు టీవీల్లో చూసి తాడేపల్లి ఇంట్లో జాంబీ రెడ్డి తొడ కొట్టుకుంటున్నారని అంటూ సెటైర్లు వేశారు నారా లోకేష్. అనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి యాక్టర్ గా మారారని.. ఆయన అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టారనే రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కాగా తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, రామవరం గ్రామంలో కేసులు, అరెస్టులకు గురైన టీడీపీ నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన నారా లోకేష్.. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్టానికి వ్యతిరేకంగా మాపై కేసులు పెడుతున్న అందరి పేర్లు సిద్ధంగా ఉన్నాయని.. వారు తగిన సమయంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *