వైఎస్ జగన్ జల యుద్ధం పై ఘాటు సమాధానం

ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నీటి విషయంలో చంద్రబాబు ఈ మధ్య మాట్లాడుతున్నారు, ఆనాడు అలా చూస్తూ ఎందుకు ఉండిపోయారు అంటూ ఏపీ సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబుకి, తెలంగాణ మంత్రులకి చెప్పేది ఏమిటి? అంటే… తెలంగాణ, రాయలసీమ, కోస్తా కలిసి ఉండేదే ఆంధ్రప్రదేశ్. దశాబ్దాలుగా ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు అనే విషయం కూడా తెలిసిందే. రాయలసీమ పరిస్థితి గమనించండి. 854 అడుగులు శ్రీశైలంలో ఉంటేనే గతంలో నీళ్లు వచ్చేవి. గతంలో ఎన్ని రోజులు డ్యామ్ లో 881 అడుగులు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి కి నీరు 800 అడుగులో తీసుకునే అవకాశం ఉంది. 800 లోపే కరెంటు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మాకు కేటాయించిన నీళ్లు 800 అడుగులో వాడుకుంటే తప్పేముంది? అంటూ జగన్ తెలిపారు.
అదేవిధంగా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో పాలమూరు డిండి, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులు కడుతుంటే ఏమి గాడిదలు కాశావు? అంటూ ప్రశ్నించారు. జగన్ సీఎంగా.. ప్రభుత్వం కోరుకునేది ఒక్కటే.. ఏ రాష్ట్రంతో తగాదాలు పెట్టు కోదల్చుకోలేదు. పక్క రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టలేదు. పక్క రాష్ట్రాలతో సఖ్యత కోరుకుంటున్నాం అంటూ జగన్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *