వెలకందని ఆనందంలో సాయిపల్లవి….!

టాలీవుడ్ లో ఫిదా సినిమా ద్వారా తెలుగమ్మాయిలా వదిగిపోయిన అందాలనటి సాయిపల్లవి. సహజంగా సాయిపల్లవి ఇన్స్టాగ్రామ్లో అరుదుగా ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. అయితే తాజాగా సాయిపల్లవి తన తాత, అమ్మమ్మ, సోదరితో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. ‘ఫిదా’ బ్యూటీ తన తాత 85వ పుట్టినరోజు కోసం సంప్రదాయ చీర కట్టుకుని కన్పించి నిజంగానే అందరినీ ఫిదా చేసింది. ఈ వేడుకలో సాయి పల్లవి నీలిరంగు పట్టు చీర ధరించి చాలా సింపుల్ గా ఉండడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలాగే వేడుకలకు సంబంధించిన ఆమె తన అమ్మమ్మ, సోదరి సినిమాలను కూడా పంచుకుంది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో సాయి పల్లవిని చూస్తుంటే ఆమె వెలకందని సంతోషంలో మునిగి తేలుతున్నట్లు అట్టే తెలిసిపోతుంది.

అదేవిధంగా ఇక నేచురల్ బ్యూటీ సినిమాల విషయానికొస్తే… నాగ చైతన్యతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. సాయి పల్లవి ఈ మధ్య నానితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఆమె రానా దగ్గుబాటితో ‘విరాట పర్వం’లో కూడా కనిపించనుంది. లవ్ స్టోరీ, విరాట పర్వం వరుసగా ఏప్రిల్ 16, ఏప్రిల్ 30న కావాల్సి ఉండగా… కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఆ రెండు సినిమాలూ వాయిదా పడ్డాయి. మరి థియేటర్స్ ఓపన్ అయితే మన ఫిదా బ్యూటీ సినిమాలు వరుస రిలీజ్ లు ఉండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *