విశాఖ ఆరుగురి హత్యకేసులో కొత్త ట్విస్ట్….
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో ఈరోజు ఉదయం ఏకంగా ఆరు హత్యలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అందుకు పాత కక్షలే కారణమని పోలీసులు చెప్తున్నారు. విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అందరూ నిద్రపోయే వరకు ఇంట్లోనే వేచి ఉన్నాడు. కుటుంబంలో అందరూ నిద్ర పోయిన తర్వాత పదునైన ఆయుధంతో కుటుంబసభ్యుల మీద దాడి చేశాడు. ఏమాత్రం కనికరం అన్నది లేకుండా ఆరుగురిని నరికి చంపేశాడు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్న పిల్లలు పసికందులు కూడా ఉన్నారు. హత్య జరిగిన తర్వాత నిందితుడు అప్పలరాజు పోలీసులకు లొంగిపోవడం ఇక్కడ ట్విస్ట్.
అయితే అప్పలరాజు కుమార్తె ఇప్పుడు హతుల కుటుంబంలోని విజయ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. 2007లో విజయవాడకు చెందిన ఉషారాణితో విజయ్ పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు, పెద్ద కుమారుడు అకీరా నందన్ వయసు ఏడేళ్లు కాగా చిన్నబ్బాయి ఉదయ నందన్ వయసు 2 ఏళ్ళు. మరో చిన్నారి లిస్విత వయసు 6 నెలలు. 2018లో బత్తిన అప్పలరాజు కుమార్తెతో విజయ్ ప్రేమ కలాపాలను సాగిస్తున్నాడు. అప్పట్లో ఆ విషయం పోలీస్ స్టేషన్ లకు వెళ్లి పంచాయతీలు కూడా జరిగాయి. అప్పలరాజు కుమార్తెకు ఇంకా పెళ్లి కాలేదు. అప్పలరాజు కుమార్తెతో విజయ్ ఫోన్ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
కాగా 2018 నుంచి విజయ్ పై కక్ష పెంచుకున్న హంతకుడు అప్పలరాజు, ఇదే వ్యవహారంపై విజయ్ కుటుంబాన్ని మొత్తం హతమార్చినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ తన కుటుంబంతో విజయవాడలో ఉంటున్నాడు. నిన్న బంధువుల పెళ్లి కార్డులు పంచేందుకు జుత్తాడ గ్రామానికి విజయ్ కుటుంబం చేరుకుంది. అదే సమయంలో విజయ్ మాత్రం రాలేదు. అతను వచ్చి ఉంటాడని ఇంట్లోకి వెళ్లి నక్కిన అప్పలరాజు కన్పించిన అందరినీ పొట్టన పెట్టుకున్నాడు. మృతుల్లో… విజయ్ తండ్రి, భార్య, అత్త, చిన్నత్త, చిన్న కుమారుడు, కుమార్తె ఉండటం విశేషం.