విజయ్ 65కి పూజా భారీ రెమ్యునరేషన్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజా హెగ్డే. ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా గుడుపుతుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలను చేస్తున్న ఈ అమ్మడు తాజాగా ఓకే చేసిన సినిమా విజయ్ 65. ఈ సినిమాకి ఇంకా పేరు ఫిక్స్ చేయలేదు.
అయితే తొలుత ఈ సినిమా కోసం కన్నడ బ్యూటీ రష్మికను అనుకున్నారు. ఆ తర్వాత రష్మిక డేట్స్ కుదరకపోవడంతో ఆ అవకాశం పూజాను వరించింది. ఈ సినిమా కోసం పూజా హెగ్దె ఓ తెలుగు సినిమాను కూడా వదిలేసుకోవాల్సి వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం పూజా తీసుకుంటున్న పారితోషికంపై తాజాగా కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అమ్మడి కెరీర్లోనే అత్యంత ఎక్కువ పారితోషికాన్ని ఈ సినిమాకి అందుకుంటున్నారని టాక్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది.
కాగా విజయ్65 సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది. దీంతో తెలుగులో మంచి మార్కెట్‌తో పాటు హిందీలోనూ ఓ మోస్తరు మార్కెట్ ఉన్న పూజాను సినిమాలోకి తీసుకుంటే మంచిదని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. అందుకే అమ్మడికి దాదాపు రూ.3.5 కోట్ల పారితోషికం ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ త్వరలోనే ఈ వార్తలపై పూజా స్వయంగా క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా విజయ్ 65 సినిమాని ఎక్కువ శాతం రష్యా, చైనా దేశాల్లో షూటింగ్ జరుపుకోనుండటం విశేషం.