వరుసగా నాలుగవ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు….

ఇండియాలో ఓ పక్క కరోనా విలయ తాండవం చేస్తుంటే మరోపక్క పెట్రోల్ రేట్లు భగ్గుమంటున్నాయి. ఈ మధ్య కాలంలో వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. అయితే ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. ఆ ఎన్నికల సమయంలో కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజల్ రేట్లను పెంచలేదు. ఆ తర్వాత నుంచి వరుసగా రేట్లు పెంచేస్తుంది. ఎన్నికలు అయిపోగానే.. పెట్రోల్ ధరలు పెంచలు పెట్టింది కేంద్రం.
అదేవిధంగా నాలుగో రోజు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 29 పైసలు, లీటర్ డీజిల్ పై 34 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.27 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 81.73 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.86 కు చేరగా.. డీజిల్ ధర రూ. 89.11 కు చేరింది. అలాగే ముంబైలో పెట్రోల్ ధర రూ. 97.61 కు చేరగా.. డీజిల్ ధర రూ. 88.82 కు చేరడం విశేషంగా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *