వనపర్తిలో వైఎస్ షర్మిల నిరాహార దీక్ష..
తెలంగాణలో ఈ మధ్యనే కొత్తగా ఏర్పాటైన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. అయితే ఈ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రతి మంగళవారం రోజున రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు నిరుద్యోగ నిరాహర దీక్ష చేసేందుకు పూనుకున్నారు. ఈరోజు వనపర్తి జిల్లాలోని తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు. పీఆర్సీ ప్రకారం రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని, వెంటనే ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా వనపర్తి జిల్లాకు చెందిన కొండల్ అనే నిరుద్యోగి ఉద్యోగం కోసం ప్రయత్నించి చివరకు విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో నిరుద్యోగులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదని వారికి భరోసా కల్పిస్తున్నారు వైఎస్ షర్మిల. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్ షర్మిల దీక్షకు శ్రీకారం చుట్టడం విశేషం. మొత్తానికి వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన వెంటనే ప్రజల్లోకి వెళ్లడం, నిరాహార దీక్షలకు పూనడంతో తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం ఏవిధంగా మారనుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.