వకీల్ సాబ్ డబ్బింగ్ పూర్తి…
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ న్యూస్ ఏ కొద్దిపాటిది వినపడినీ అది అట్టే క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. తాజాగా వకీల్ సాబ్ మూవీ అప్డేట్ వచ్చింది. అదేమంటే.. ‘వకీల్ సాబ్’ కోసం ఈ మధ్య డబ్బింగ్ మొదలెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐదురోజుల్లోనే దానిని పూర్తి చేసేశాడు.
అదేవిధంగా గత రాత్రి పవన్ డబ్బింగ్ పూర్తి చేసిన తర్వాత దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో పాటు ఇతర టీమ్ తో ఫోటో దిగాడు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో, అటు పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటీ వకీల్ సాబ్ ను విజయవంతంగా పూర్తి చేశాడు పవన్. ‘వకీల్ సాబ్’ కి సంబంధించి ప్రచారానికి కూడా రెడీ కాబోతున్నాడు. కాగా ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ లాయర్ గా హడలెత్తించనున్నాడు పవన్. ఈ నెలాఖరులో ప్రీ-రిలీజ్ వేడుక జరగనుంది. ఏప్రిల్ 9న ఈ సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. అయితే బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.