వంశీ పైడిపల్లి మూవీలో కీర్తి సురేష్…?

తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మించనున్నారు అనే విషయం తెలిసిందే. అందుకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ మధ్య వంశీ, విజయ్ ని కలిసి స్టోరీ విన్పించగా… ఈ స్టోరీ లైన్ నచ్చిందని విజయ్ సినిమా చేయటానికి అంగీకరించారు కూడా.
అయితే భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే విజయ్ నేరుగా తెలుగులో చేస్తున్న తొలి సినిమా కూడా ఇదే అవుతుంది. మహేష్ బాబు, రామ్ చరణ్ లు తిరస్కరించినప్పటికీ దర్శకుడు వంశీ పైడిపల్లి చివరకు విజయ్ తో కలిసి పాన్-ఇండియన్ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. మహేష్ బాబుతో అతను చేయాలనుకున్నదానికంటే ఇది పెద్ద ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోనా సంక్షోభం తగ్గిన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతోందనేది టాక్ కోలీవుడ్ లో అప్పుడే మారుమ్రోగుతుంది. అయితే కీర్తి సురేష్ ఇంతకు ముందు విజయ్ తో కలిసి రెండు సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా అవుతుంది. కాగా వంశీ పైడిపల్లి స్క్రిప్ట్కు ప్రస్తుతం ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *