లోన్ యాప్స్ కేసులో ఛార్జ్ షీట్ రెడీ… 20 మంది అరెస్ట్

తాజాగా దేశంలో లోన్ యాప్స్ కేసు పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. లోన్ యాప్స్ కు ఎంతో మంది బలి అయ్యారు. ముఖ్యంగా ఆన్లైన్ లోన్ యాప్స్ కేసులో సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛార్జ్ షీట్ ను రెడీ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు 20 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కాగా మొత్తం 22 వేల కోట్ల రూపాయల మోసపూరిత వ్యాపారం జరిగినట్టు లోన్ యాప్స్ కేసులో భాగంగా దర్యాప్తు చేసిన పోలీసులు గుర్తించారు. 197 మొబైల్ యాప్స్ ద్వారా దాదాపుగా లక్ష మందికి రుణాలు ఇచ్చినట్టుగా ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు. అత్యధిక వడ్డీతో రూ.10వేల లోపు రుణాలు అందించారు. ఎన్బీఎఫ్సిని ప్రధాన నిందితుడు లాంబో ఇష్టానుసారంగా వాడుకున్నాడు. కాగా తొలిసారిగా బెంగళూరు కేంద్రంగా నాలుగు కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఆ తర్వాత స్థానిక ఫైనాన్సర్లను ఉచ్చులోకి లాగాడు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న జెన్నిఫర్ చైనా నుంచే తన కార్యకలాపాలు సాగించాడు. జెన్నిఫర్ చైనాలో ఉండటం వలన అరెస్ట్ చేయలేకపోయినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *