లోకేష్ వి శవరాజకీయాలు : హోమంత్రి సుచరిత
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీ నేతలు ఈ కరోనా విపత్తు సమయంలో కూడా శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు హోంమంత్రి సుచరిత. లోకేష్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతో జరుగుతున్న ఘటనలకు కూడా రాజకీయ రంగులు పులుముతున్నారని ఆమె వెల్లడించారు. అలాగే కర్నూలు జిల్లాలో జరిగిన హత్యలు వ్యక్తిగత కారణాలతో జరిగిందని ప్రజలు చెప్తున్నారని.. ఇది రాజకీయ ఘటన కాదని.. అసలు ఘటనకు కారణాలేంటో కూడా తెలుసుకోకుండా లోకేష్ అక్కడికి వెళ్లి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆమె విమర్శించారు. అలాగే లోకేష్ ప్రజలను రెచ్చగొడుతున్నారని.. గత ప్రభుత్వంలో 30కిపైగా రాజకీయ హత్యలు జరిగాయని సుచరిత వివరించారు.
అదేవిధంగా ప్రభుత్వంపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తెలుగుదేశం నాయకులు ఈరోజు చిన్న చిన్న ఘటనలను అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలని కాచుకొని ఉన్నారని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ రాజ్యాంగ నడిచిందో లోకేష్, చంద్రబాబు చెప్పాలని.. లోకేష్ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నాడని తెలిపారు. ఆయన ఉద్ధేశ్యం వారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకటికి పది మందిని చంపుతామని లోకేష్ చెప్తున్నారని.. గతంలో కాల్ మనీ కేసులో ఏ విధంగా నిందితులను తప్పించారో ప్రజలందరికీ తెలుసని కూడా సురిత వెల్లడించారు. కాగా మా ప్రభుత్వంలో తప్పు చేసినవారు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా వారు తప్పించుకోలేరని మరోమారు హోంమంత్రి సుచరిత వివరించారు.