లైంగిక వేధింపులకు ఆ జిమ్నాస్టిక్ కోచ్ బలి..
అమెరికాలో ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. లైంగిక వేధింపుల ఆరోపణలతో జాన్ గెడ్డార్ట్ తాజాగా బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది అంటే.. గతంలో ఒలింపిక్ జిమ్నాస్టిక్స్ కోచ్గా పని చేసిన గెడ్డార్ట్ మిచిగన్లో మహిళా జిమ్నాస్ట్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. ఇందులో లారీ నాసర్ అనే డాక్టర్ కూడా పని చేస్తున్నాడు. ఎంతో మంది మహిళలు జిమ్నాస్టిక్ శిక్షణ కోసం ఈ సెంటర్కు వచ్చేవారు. అయితే గెడ్డార్ట్, నాసర్ అక్కడి మహిళా జిమ్నాస్ట్లను లైంగికంగా వేధించడంతో పాటు, మానసికంగా హింసించేవారని నాసల్ అనే వ్యక్తి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.
అయితే నాసల్ చేసిన ఆరోపణలతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును మొదలు పెట్టారు. దీంతో అసలు గుట్టు బయటపడింది. లైంగిక వేధింపులకు గురైన వారిలో ఎక్కువగా 13, 16 సంవత్సరాలలోపు వయసువారేనని మిచిగాన్ అటార్నీజనరల్ డెనా నిసెల్ స్పష్టం చేశారు. అంతేకాకుండా గెడ్డార్ట్, నాసర్లు తన కూతురిని కూడా లైంగికంగా వేధించారని ఒక జిమ్నాస్టిక్ ట్రైనీ తల్లి తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన జాన్ గెడ్డార్ట్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అలాగే గెడ్డార్ట్ తనను లైంగికంగా వేధించాడని మాజీ జిమ్నాస్ట్ రాచెల్ డెస్హోలాండర్ 2000 సంవత్సరంలోనే సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించడం ఇప్పుడు సంచలనంగా మారి కేసును కొత్త మలుపులు తిప్పడం విశేషం.