లిప్ లాక్ కు రెడీ అంటోన్న కంచె బ్యూటీ…!
టాలీవుడ్ లో కంచె సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది ప్రగ్యా. మంచి అందం, చక్కని అభినయంతో అలరించే అందమైన నాయికే కానీ… ఎందుకో వెనుకబడిపోతోంది ప్రగ్యా జైస్వాల్. ఎంత ప్రయత్నాలు చేస్తున్న స్టార్ డమ్ మాత్రం ఇంకా దక్కలేదు. అయితే.. తన నెక్ట్స్ మూవీ ‘అఖండ’ సినిమాలో బాలయ్యతో కనిపించనున్న అందాల సుందరి ముద్దుముచ్చట్లపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
అవేమంటే.. సినిమాలో పెద్దగా ఎప్పుడూ స్కిన్ షో ఎప్పుడూ చేయలేదు ప్రగ్యా జైస్వాల్. నిజ జీవితంలో డేటింగ్ పై స్పందిస్తూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ కామెంట్ చేసింది. తాను డేటింగ్ చేస్తే ఫస్ట్ డేనే కిస్ చేయలేనని చెప్పేసింది. ముందు మనసులు కలవాలని అప్పుడే పెదాలు కలుపుతానని చక్కా చటుక్కున చెప్పేసిందీ భామ. కాగా తన పార్టనర్ తో ఫుల్ కంఫర్టబుల్ అవ్వకుండానే లిప్ లాక్ చేసే రకం తాను కాదన్నది ప్రగ్యా భావన కాబోలు. మొత్తానికి తాను అంతగా ఈజీగా లొంగే రకం కాదని కాస్త ఓపికతో మనసులు కలుసుకోవాలని ఆ తర్వాతే ఏమైనా అంటూ చెప్పకనే చెప్పేసింది ప్రగ్యా జైస్వాల్.