లావుగా ఉన్నారని 140మంది ఉద్యోగాలు హుష్….

కరోనా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా కరోనా కాలం…. ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి. మరెన్నో కంపెనీలలో ఉద్యోగాలు పోయి యువత రోడ్డున పడ్డాకు. ఇలాంటి సమయంలో వింతైన అంశంతో ఉద్యోగులకు చెక్ పెట్టింది విమానయాన సంస్థ.
అదేమంటే… విమానయాన సంస్థలో బొద్దుగా ఉంటే పనికిరారు. నాజూగ్గా, ఫిట్ గా ఉన్నవారికే ఆ ఉద్యోగాల్లోకి అనుమతి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న సమయంలో లావుగా మారితే ఏమాత్రం ఆలోచించకుండా నిర్థాక్షణ్యంగా తొలగించేస్తారు. ఎయిర్లైన్స్ ఉద్యోగాలు చేసే వారు తప్పనిసరిగా నాజూగ్గా కనిపించి తీరాలి అంతే… అయితే తాజాగా లావుగా ఉన్నారని పాకిస్తాన్ ఎయిర్లైన్స్ సంస్థ 140 మందిని విధుల నుంచి తొలగించేసింది. పలుమార్లు వారికి నోటీసులు ఇచ్చామని, అధిక బరువు తగ్గించుకోవాలని చెప్పినా ఏమాత్రం వినకపోవడంతో వారి పేర్లను జూలై నెలకు సంబందించి ఫ్లైట్ డ్యూటి రోస్టర్ లిస్ట్ నుంచి తొలగించింది. దీంతో 140 మంది సిబ్బంది పాక్ ఎయిర్లైన్ తీరుపై మండిపడుతున్నారు. మరి వీరు ముందు ముందు ఎలాంటి నిరసన వ్యక్తం చేస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *