లవ్ లో పడిపోయానంటున్న హీరోయిన్….

సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానగణం ఉన్న ప్రముఖ తమిళ నటి ప్రియా భవాని శంకర్. ఆమె తాజాగా ఓ రహస్యాన్ని వెల్లడించింది. అదేమంటే… ఆమె ప్రేమలో పడిందని చెప్పేసింది. ఈ మధ్య నెటిజన్లతో ముచ్చటించిన ఈ యంగ్ బ్యూటీ లవ్ మ్యాటర్ ను బయట పెట్టేసింది. ఓ నెటిజన్ ఆమె వివాహం గురించి ప్రశ్నించగా… దానికి స్పందించిన ప్రియా ‘నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. కానీ నా దృష్టి ప్రస్తుతం నా కెరీర్పై ఉంది. సమయం వచ్చినప్పుడు నా వ్యక్తిగత జీవితంపై మరిన్ని వివరాలను పంచుకుంటాను’ అంటూ చెప్పేసుంది సుందరాంగి.
అలాగే తన ప్రియుడు సినీ పరిశ్రమకు చెందినవాడా? కాదా? అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ఫ్యాన్స్ ను సస్పెన్స్ లో పడేసింది. కాగా ప్రస్తుతం కమల్ హసన్ ‘ఇండియన్ 2’లో ప్రియా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. అయితే బుల్లితెర ప్రేక్షకులకు ఆమె బాగా తెలుసు. తమిళ టీవీ సీరియల్స్ లో ఆమె చేసిన పాత్రలకు, నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా సక్సెస్ కావాలని భావిస్తోంది ఈ అమ్మడు. చూద్దాం ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో అమ్మడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *