రేపే సీఎంగా దీదీ ప్రమాణం…
పశ్చిమబెంగాల్ సీఎంగా మమతా హ్యాట్రిక్ హిట్ కొట్టారు. తాజాగా వచ్చిన ఫలితాలతో మరోసారి అంటే ముచ్చటగా మూడోసారి దీదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ.. కొత్తగా ఎన్నికైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆమె సీఎం చైర్ను మూడోసారి అధిష్టించడం ఖాయమైంది. ఈ నెల 5వ తేదీన మమతా బెనర్జీ.. బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని తెలిపారు టీఎంసీ జనరల్ సెక్రెటరీ పార్థా చటర్జి.
అదేవిధంగా ప్రొటెం స్పీకర్గా గత అసెంబ్లీలో స్పీకర్గా పనిచేసిన బిమన్ బెనర్జీని ఎన్నుకుంటామని తెలిపారు. అలాగే ఈ నెల 5వ తేదీన మమతాబెనర్జీ సీఎంగా ప్రమాణం చేయనుండగా.. మే 6నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణం చేస్తారని వెల్లడించారు. ఇదిలా ఉండగా తన సీఎం పదవికి నిన్న రాజీనామా చేశారు దీదీ. రాజ్భన్కు వెళ్లిన ఆమె గవర్నర్ జగదీప్ ధన్కర్ను కలిసి.. తన రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో.. కొత్తగా సర్కార్ను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కూడా కోరారు మమతా బెనర్జీ. కాగా మూడోసారి.. బెంగాల్ టైగర్ సీఎం చైర్ ఎక్కడం ఇక లాంఛనం కావడం విశేషం.