రేపటి నుంచే షర్మిల నిరాహార దీక్ష.. మరి ఒక్క రోజుకే పర్మిషన్..
తెలంగాణలో వైఎస్ షర్మిల చేపట్టనున్న నిరాహార దీక్ష రేపటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో జరిగిన సభలో వైఎస్ షర్మిల ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెంటనే రిలీజ్ చేయాలని లేదంటే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు వైఎస్ షర్మిల. ఆమె చెప్పినట్లుగానే షర్మిల నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు.
కాగా ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతులు మంజూరు చేశారు. ఒక్కరోజు మాత్రమే అదీకూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలీసులు అనుమతులు ఇచ్చారు. దీంతో లోటస్ పాండ్ లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. మరి షర్మిల మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేస్తారా? లేకా ఒక్కరోజు మాత్రమే చేస్తారా? అనే విషయం దీక్షకు కూర్చొని ఆ తర్వాత జరిగే పరిణామాలను బట్టి తెలియాల్సిందే.