రెండో దోస్ వేసుకున్న నదియా… వైద్య సిబ్బందికి సెల్యూట్

అప్పట్లో నదియా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా రీఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. 2013 నుంచి తెలుగులో ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘బ్రూస్ లీ ది ఫైటర్’, ‘నా పేరు శివ’ ‘మిస్ ఇండియా’ వంటి సినిమాలతో కేక పుట్టిస్తుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ‘బాక్సర్’.. విక్టరీ వెంకటేష్ తో ‘దృశ్యం 2’ సినిమాలో నటిస్తోంది.
అయితే నదియా తొలిసారి తెలుగులో సూపర్స్టార్ కృష్ణ కుమారుడు రమేష్బాబుతో కలిసి 1988లో ‘బజార్ రౌడీ’ సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘వింతదొంగలు’, ‘ఓ తండ్రి కొడుకు’ సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటే… ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా విజృంభిస్తుంది. ఈ తరుణంలో వాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే సినీ ప్రముఖులు మొదటి డోస్ పూర్తి చేసుకున్నారు. మరికొందరు సెకండ్ డోస్ కూడా వేసుకుంటున్నారు. తాజాగా నదియా సెకండ్ డోస్ వేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అదే సమయంలో వైద్య సిబ్బందిని చూస్తే గర్వంగా ఉందంటూ వారికి నదియా స్టైల్ సెల్యూట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *