రానాకి ఆల్ ది బెస్ట్ చెప్పిన స్వీటీ
‘బాహుబలి’ ‘బాహుబలి 2’ తో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయి నటీనటులుగా వెలిగిపోయారు ప్రబాస్, రాణా, అనుష్క. ఆ తర్వాత అనుష్క ‘రుద్రమదేవి’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. రానా ‘అరణ్య’ విడుదల సందర్భంగా అనుష్కకు ప్రత్యేకంగా గూడీస్ ని కానుకగా పంపాడు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది అనుష్క.
అంతే కాకుండా ‘థాంక్యూ రానా బ్రో.. నాకు ఇవి బాగా నచ్చాయి. ‘అరణ్య’ టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ చేసింది స్వీటీ. ఇంకా రానా పంపిన గూడీస్ తో పాటు తన పెట్ డాగ్ ని నిలబెట్టిన ఫోటో షేర్ చేసింది అనుష్క. కాగా బాహుబలి నుంచి వీరిద్దమధ్య చక్కని బంధం ఏర్పడిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలోని పలువురు సన్నిహితులకు రానా స్పెషల్ గా ‘అరణ్య’ గూడీస్ పంపాడు. వారందరూ సోషల్ మీడియా వేదికగా రానాకు స్పెషల్ గా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అరణ్య’ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన లేకపోయినా… హడావుడి మాత్రం సోషల్ మీడియాలో బాగా వచ్చింది. కాగా ఈ సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై ఎక్కించుకొని మోయడమే కాకుండా అద్భుతంగా నటించి మెప్పించిన రానాకు విపరీతంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.