రాథికా శరత్ కుమార్ దంపతులకు ఏడాది జైలు శిక్ష
చెక్ బౌన్స్ కేసులో చెన్నై స్పషల్ కోర్టు రాథికా, శరత్ కుమార్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. సినీ ప్రముఖులైన రాధిక, శరత్ కుమార్ దంపతులకు ఈరోజు శిక్షను విధిస్తూ కోర్టు షాకింగ్ తీర్పును వెల్లడించింది. అసలే జరిగింది అంటే… రాధిక, శరత్ కుమార్ గతంలో పలు చిత్రాలకు నిర్మాతలుగా కూడా వ్యవహరించారు.
అయితే ఆ సమయంలో ఓ నిర్మాణ సంస్థ నుండి భారీగా రుణం తీసుకున్నారు. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమని నిర్మాణ సంస్థ వారు అడగడంతో… రాధిక, శరత్ కుమార్ వారికి చెక్కును ఇచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు నిర్మాణ సంస్థ రాధిక, శరత్ కుమార్ లపై కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన చెన్నై స్పెషల్ కోర్టు ఈరోజు తన తీర్పును వెలువరించింది. రాధిక, శరత్ కుమార్ లకు ఏడాది జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం తమిళనాడులో సినీ సర్కిల్ లో సంచలనంగా మారింది.