రాజ్ కుంద్రా కస్టడీ మళ్లీ పొడిగింపు…..!

ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్న రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ ఈ రోజుతో ముగిసింది. తాజా విచారణలో కోర్టు ఈ వ్యాపారవేత్త బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ మరికొన్ని రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. రాజ్ కుంద్రా, ర్యాన్ తోర్పేలను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. బాలీవుడ్ నటి శిల్పా శెట్టిభర్త రాజ్ జూలై 19న పోర్న్ రాకెట్ కేసులో అరెస్టయ్యాడు. జూలై 23న క్రైమ్ బ్రాంచ్ ముంబైలోని అంధేరిలోని రాజ్ కుంద్రా ‘వియాన్ ఇండస్ట్రీస్’ కార్యాలయంపై దాడి చేసి, దాచిన అల్మరాను కనుగొంది. ఇందులో ఆర్థిక లావాదేవీలు, క్రిప్టోకరెన్సీ గురించి అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రాజ్, శిల్పా శెట్టి జుహు బంగ్లాపై కూడా పోలీసులు దాడి చేశారు. శిల్పాను కూడా పోలీసులు ప్రశ్నించారు. ‘హాట్ షాట్స్’ కంటెంట్ పై తనకు తెలియదని శిల్పా స్టేట్మెంట్ లో పేర్కొన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

అదేవిధంగా ఈ వివాదాస్పద కేసులోముంబై పోలీసులు రాజ్ కుంద్రాకు సంబంధించిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. 48 టిబి డేటాను యాక్సెస్ చేయగలిగామని… రాజ్ కుంద్రా సూచనల మేరకు ఈ కేసు దాఖలు చేసిన తర్వాత భారీగా డేటా తొలగించబడింది. అలాగే రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత మరింత డేటా తొలగించబడింది అని పోలీసులు వెల్లడించారు. అడల్ట్ కంటెంట్ మేకింగ్ కేసులో రాజ్ కుంద్రా పాత్రను పరిశీలిస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ కాకుండా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తులో చేరే అవకాశం ఉంది. రాజ్ మెర్క్యురీ ఇంటర్నేషనల్ కంపెనీ (ఆన్లైన్ బెట్టింగ్ మరియు క్యాసినో గేమింగ్) దక్షిణాఫ్రికా బ్యాంక్ ఖాతా మధ్య అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను పోలీసులు కనుగొన్నందున వారు మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించనుండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *