రాంచరణ్-శంకర్ మూవీ షూటింగ్ కి రెడీ…!
టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్, తమిళస్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పై క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావొస్తున్నాయని సమాచారం అందుతుంది.
అదేవిధంగా ఈ సినిమా జూలై రెండో వారంలో పూజా కార్యక్రమాలు జరుపుకొని, ఆగష్టు మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుందని.. అందుకు సంబందించిన సెట్స్ పనులు వేగవంతం అయ్యాయని కూడా సమాచారం అందుతుంది. కాగా రాంచరణ్ కెరీర్ లో 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చెర్రీ సరసన నటించే హీరోయిన్ పై ఇంకా ఉత్కంఠ నెలకొని ఉంది.