రజనీకాంత్ మరోసారి కుండబద్దలు

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన రాజకీయాల విషయాలపై స్పష్టమైన ప్రకటన చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలను విడిచి పెడుతున్నట్లు షాకింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రకటన తర్వాత తలైవా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రజనీకాంత్ తాజాగా తన సంస్థ ‘మక్కల్ మండ్రం’ భవిష్యత్ పై తాజా ప్రకటనలో వివరించారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం తనకు లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. అలాగే రజినీ ‘మక్కల్ మండ్రం’ ఇకపై పని చేయదు అని కూడా వివరించారు.

అదేవిధంగా అసలు ఆయన ఏమన్నారు అంటే ‘ప్రస్తుత పరిస్థితుల కారణంగా మేం అనుకున్నది జరగలేదు. మళ్ళీ రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన నాకు లేదు’ అంటూ ఆయన వివరించారు. అంతేకాకుండా ఇంకా రజనీకాంత్ ఏం తెలిపారు అంటే.. ఈ సంస్థను మంచి పనుల కోసం, అభిమానుల సంక్షేమ సంఘంగా మార్చబోతున్నట్టు వెల్లడించారు. ఆర్‌ఎంఎం‌లోని కార్యదర్శులు, సహచరులు, డిప్యూటీ సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ప్రస్తుతానికి పని చేస్తూనే ఉంటారని తెలిపారు. కాగా రజనీకాంత్ ఈ ఉదయం చెన్నైలో ఆర్‌ఎంఎం సభ్యులను కలుసుకొని ఈ నిర్ణయం ప్రకటించడం విశేషం. అయితే ప్రస్తుతం ఈ సూపర్ స్టార్ సిరుతై శివ దర్శకత్వంలో పిక్చర్స్ బ్యానర్‌లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘అన్నాత్తే’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *