యోగీ పై దీదీ తీవ్ర వ్యాఖ్యలు….. మోడీ ప్రశంసలు….
తాజాగా ప్రధాని మోడీ వారణాసిలో పర్యటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసలు కురిపించారు. కరోనా సెకండ్ వేవ్ను కట్టడి చేయడంలో యోగి సర్కార్ మంచి ఫలితాను సాధించిందని అన్నారు. దేశంలో అత్యధిక సంఖ్యలో కరోనా టెస్టులు నిర్వహించారని, ట్రీట్మెంట్ అందివ్వడంలో యూపీ ముందు వరసలో ఉందని, అదే విధంగా రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణకు యోగీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా అద్భుతమని ఆయన ప్రశంసించారు.
అదే విధంగా యోగి సర్కార్పై మోడీ ప్రశంసలు కురిపించడంతో బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. కరోనాను కట్టడి చేస్తే గంగానదిలో శవాలు ఎందుకు కొట్టుకొచ్చాయని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రం కావడం వలనే యోగీ సర్కార్కు సర్టిఫికెట్ ఇచ్చారని మమత బెనర్జీ మండిపరడ్డారు. కాగా పశ్చిమ బెంగాల్ కూడా కోవిడ్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుందని, అందుకే గంగానదిలో శవాలు కనిపించలేదని స్పష్టం చేశారు. అలాగే యోగి సర్కార్ సెకండ్ వేవ్ ను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందని దీదీ విరుచుకు పడ్డారు.