యస్ ప్రమాణానికి మేం రెడీ మీరు రెడీనా..?
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నిక రాజకీయ నేతల మధ్య హీట్ ను పెంచుతుంది. ఇదే సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంపై నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా వైఎస్ వివేకా కూతురు.. సీబీఐ దర్యాప్తుపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అంశాన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఈ మధ్య నారా లోకేష్ మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్యపై వైఎస్ కుటుంబానికి సంబంధం లేదని ప్రమాయం చేయాలంటూ సవాలు విసిరారు. అందుకు ధీటుగా ప్రతిస్పందించిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్యతో తమకు సంబంధంలేదని మేం ప్రమాణం చేస్తాం.. కానీ.. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి ప్రమేయం లేదని నారా లోకేష్ ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నాస్త్రాన్ని సంధించారు.
అదేవిధంగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. అలాగే రమణ దీక్షితులు తనకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలిపిన ఆయన సీఎం జగన్.. తాను దేవుడు, రాముడు, జీసన్ అని ఎప్పుడూ చెప్పకోలేదని వివరించారు. తిరుపతిలో సీఎం జగన్ ప్రచారంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. వైఎస్ జగన్ భయపడి ప్రచారానికి వస్తున్నారని ఎవరైనా భావిస్తే అది అపోహ మాత్రమేనని.. వరుస విజయాలతో ఉన్న వైసీపీ ఎందుకు భయపడుతుంది? అంటూ ధీటుగా బదులిచ్చారు పార్థసారథి.