యశ్ తర్వాత సినిమా డైరెక్టర్ గా నర్తన్
‘కేజీఎఫ్’ సినిమా సంచలనం సృష్టించాడు యశ్, ప్రశాంత్ నీల్. అయితే, కన్నడ టాలెంటెడ్ డైరెక్టర్ తన నెక్ట్స్ హీరోగా ప్రభాస్ ను ఎంచుకున్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్, యశ్. అయితే ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ ‘సలార్’ మూవీ ప్రకటించాడు కూడా. ప్రభాస్ తో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. మరి యశ్ ఇక ఎవరితో అనేది క్లారిటీ వచ్చేసింది.
‘కేజీఎఫ్ 2’ సినిమా తర్వాత రాకింగ్ స్టార్ మరో టాలెంటెడ్ కన్నడ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘మఫ్టీ‘ సినిమాతో సూపర్ హిట్ సినిమా కొట్టిన యంగ్ డైరెక్టర్ నర్తన్ ఆ అవకాశాన్ని కొట్టేసినట్లు తెలుస్తోంది. నిజానికి డైరెక్టర్ నర్తన్ శాండల్ వుడ్ సీనియర్ హీరో శివరాజ్ కుమార్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆయనతో ప్రాజెక్ట్ కొన్నాళ్లు వాయిదాపడటంతో యశ్ వద్దకి చేరిపోయినట్లు సమాచారం అందుతుంది.
కాగా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతోన్న సినిమాకి ‘జటస్య’ అనే టైటిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలై పోయాయి. మరోసారి యశ్ ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ నే జనం ముందుకు తీసుకు రాబోతున్నాడు. అందుకు తగ్గట్టే ఆయన సరసన తమన్నా హీరోయిన్ గా నటించనుంది. తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకి ఇప్పటికే తమన్నా పేవరెట్ హీరోయిన్. ఇక యశ్ నెక్ట్స్ మూవీతో కన్నడంలో ఫుల్ లెంగ్త్ రోల్ లో వెళ్లనుంది తమన్నా. ‘బాహుబలి’లో అందాల అవంతికగా కనువిందు చేసిన తమన్నా గతంలోనే… యశ్ తో ‘కేజీఎఫ్’లోనూ… స్పెషల్ సాంగ్ లో ఆడిపాడిన విషయం తెలిసిందే.