మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఆ సంస్థతను ఎంతో వేగంగా ప్రగతి పథంలో నడుపుతున్న సత్యనాదెళ్ల ఇప్పుడు చైర్మన్ గా సేవలు అందించనున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ టెక్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన మైక్రోసాఫ్ట్ కు కొత్త చైర్మన్గా సత్య నాదెళ్లను నియమించింది. ఇప్పటి వరకు చైర్మన్గా వ్యవహరించిన జాన్ థాంప్సన్ స్థానంలో సత్యనాదెళ్లను నియమించడం విశేషం.
అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ అభివృద్ధిలో సత్యనాదెళ్ల కీలకపాత్ర పోషించారు. 2014లో ఆయన్ను సీఈవోగా నియమించారు. సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్కు సీఈవోగా బాధ్యతలు చెపట్టిన తర్వాత ఆ కంపెనీ మరింత వేగంగా అభివృద్ది చెందింది. సీఈవోగా వ్యహరిస్తున్న సత్యనాదెళ్లను చైర్మన్గా నియమించేందుకు బోర్డు ఏకగ్రీవంగా అమోదించినట్టు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. కాగా ఇప్పటివరకు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన జాన్ థాంప్సన్ను స్వతంత్ర డైరెక్టర్ పదవిలో సేవలు అందించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *