ముత్తూట్ ఫైనాన్స్ చైర్మన్ ఇకలేరు
దేశంలోనే అతిపెద్ద గోల్డ్ లోన్ సంస్థగా పేరుగాంచిన ముత్తూట్ పైనాన్స్ చైర్మన్, ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ మృతి చెందారు. ముత్తూట్ కుటుంబంలో ఆయన మూడోతరానికి చెందిన వ్యాపారవేత్త. అయితే ప్రస్తుతం ఆయన ముత్తూట్ గ్రూప్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
అయితే ఆయన పూర్తి పేరు మత్తయ్య జార్జ్ ముత్తూట్. ఆయన డైరెక్షన్ లో ముత్తూట్ ఫైనాన్స్ దేశంలోనే గోల్డ్లోన్ ఇచ్చే అతిపెద్ద సంస్థగా అభివృద్ధి చెందింది. కేరళలోని కొచ్చి ప్రధాన కార్యాలయంగా ముత్తూట్ కార్యకలాపాలు జరుగుతుంటాయి. ముత్తూట్ ఫైనాన్స్కు దేశవ్యాప్తంగా పలు శాఖలు ఉన్నాయి. వాటిలో కొన్ని లక్షల మంది ఖాతాదారులు ఉండటం విశేషం. కాగా 2011లో ఫోర్బ్స్ ఆసియా మేగజైన్ ఎంజీ జార్జ్ ముత్తూట్కు దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 50వ స్థానం కల్పించింది. 2019 నాటికి జార్జ్ ముత్తూట్ 44వ స్థానానికి చేరుకోవడం విశేషంగా చెప్పవచ్చు.