మాస్క్ లేని వాళ్లకు వెతికి పట్టుకొని మరీ కరోనా టెస్ట్ లు…
ఇండియాలో ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో మాస్క్ ధరించడం అనేది నిత్యం అంటిపెట్టుకొని ఉండాల్సిన విషయం. దీంతో తమిళనాడులో అధికారులు మాస్క్ పెట్టుకోని వ్యక్తులను గుర్తించి మరీ వెంటపడి వారికి కరోనా టెస్ట్ లు చేయించడం మొదలు పెట్టారు.
అయితే కరోనా కాలంలో మాస్క్ ధరించడం కామన్ గా మారింది. మాస్క్లేకుండా బయటకు వస్తే కరోనా నుంచి ప్రమాదం పొంచి ఉన్న విషయం తెలిసిందే. దీంతో దాదాపుగా ప్రజలు మాస్క్ లేకుండా బయటకు వచ్చేందుకు ఇష్టపడటంలేదు. అయితే ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది మాస్క్ పెట్టుకోకుండా బయటకు వస్తున్నారు. వీరి నుంచి మిగతావారికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన అధికారులు వారిని పట్టుకొని తగిన కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
అంతేకాకుండా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే వార్తలు విపరీతంగా వస్తున్నాయి. దీంతో తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని పల్లడం మున్సిపాలిటీ వినూత్న నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా బయటకు వచ్చే వారికి కరోనా టెస్టులు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకు పోలీసులు, వైద్యశాఖాదికారుల సమన్వయంతో పల్లడం మున్సిపాలిటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తాజాగా మాస్క్ లేకుండా బయట కనిపించిన 100 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు అధికాలరులు వెల్లడించారు. దీంతో బయటకు వచ్చే వ్యక్తులు విధిగా మాస్క్ ధరిస్తున్నారు. వామ్మో.. మాస్క్ లేకపోతే కరోనా టెస్ట్ లు చేస్తున్నారనే వార్త అందరికీ తెలియడంతో తగిన జాగ్రత్తలు పాటిస్తుండటం విశేషం.