మాస్క్ లేకపోతే… అక్కడ 6 నెలలు జైలు
దేశంలో మళ్లీ కరోనా చాలా తీవ్రంగా విజృంభిస్తుంది. మొదటి దశలో కరోనా నివారణ కోసం మాస్క్లు ధరించి భౌతిక దూరాన్ని పాటించిన ప్రజలు ఇప్పుడు తిరిగి పెడుతున్నా ఆదమరుస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను అనుసరించడం మానేశారు. గతంలో కంటే ఒక్కసారిగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో అవన్నీ మర్చిపోయారు. బయట ప్రజలను చూస్తే.. అసలు కరోనా ఉందా? అనే అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. దీంతో.. అప్రమత్తమైన ప్రభుత్వాలు.. మళ్లీ లాక్డౌన్, జనతా కర్ఫ్యూ వైపు అడుగులు వేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. తమిళనాడు ప్రభుత్వం మాస్క్ నిబంధనలను మళ్లీ కఠినతరం చేసింది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఊటీలో మాస్క్ తప్పనిసరి చేసింది. అంతేకాకుండా మాస్క్ ధరించకపోతే శిక్షలు కూడా కఠినంగా అమలు చేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
అయితే వరుసగా ఊటీలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు మాస్కులు లేకుండా బహిరంగ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. సభలు, సమావేశాల్లో పాల్గొనడమే అందుకు కారణంగా వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా నీలగిరి జిల్లా కలెక్టర్ ఇన్సెంట్ దివ్య హెచ్చరికలు జారీ చేశారు. ఊటీలోని ప్రజలు, పర్యాటకులు మాస్కులు ధరించకుండా సంచరిస్తే 6 నెలల జైలుశిక్ష విధిస్తామని ప్రకటించారు. మాస్కు లేకుండా పట్టుబడిన వారికి 6 నెలల జైలుతోపాటు రూ.200 జరిమానా కూడా విధించనున్నట్లు వివరించారు.