మావోల చెర నుంచి రాకేశ్వర్ సింగ్ రిలీజ్
మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ఎట్టకేలకు విడుదల అయ్యాడు. రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం అధికారులు ఆపరేషన్ కుకూన్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే జవాన్ విడుదల బాధ్యత రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్ కు అప్పగించింది ప్రభుత్వం.
కాగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్.. ఇప్పటికే మావోయిస్టుల దాడిపై పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నారని అడవుల్లో జరిగిన దాడికి సంబంధించి కేంద్ర బలగాలతో సమీక్ష జరిపారని కూడా సమాచారం అందుతుంది. అయితే ఆరు రోజులుగా మావోయిస్టుల చెరలోనే ఉన్న రాకేశ్వర్ ను విడుదల చేశారని.. కొద్ది సేపటిలో బెటాలియన్ వద్దకు రాకేష్ చేరుకోనున్నారని ఐజీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.