మహిళలకు తమిళనాడు సీఎం వరాలు….

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకె స్టాలిన్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రంగంలోకి దిగారు. ప్రజారంజకంగా పాలన సాగించాలని భావిస్తున్నారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ముఖ్యంగా మూడు ఫైల్స్ పై స్టాలిన్ సంతకం చేశారు. అందులో మొదటిది బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, రేషన్ కార్డులు ఉన్న 2.07 కోట్ల కుటుంబాల కు రూ.4వేల రూపాయల చొప్పున సాయం అందించే ఫైల్ పై ముఖ్యమంత్రి స్టాలిన్ సంతకం చేశారు.
అంతేకాకుండా మొదటి నెలలో రూ. 2 వేలరూపాయలు, తరువాత నెలలో రెండు వేల రూపాయలను జమ చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో లీటర్ పాలపై రూ.3 తగ్గింపుకు సంబంధించిన ఫైల్ పై కూడా స్టాలిన్ సంతకం చేశారు. ఎన్నికలకు ముందు డీఎంకే పార్టీ 500 లకు పైగా హామీలతో కూడిన మ్యానిఫెస్టోను రూపొందించిన విషయం తెలిసిందే. కాగా అలా హామీలు గుప్పించిన వాటిల్లో ముఖ్యమైన వాటిని ముందుగా అమలు చేసేందుకు స్టాలిన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *