మరో రాష్ట్రంలో లాక్ డౌన్.. ఏకంగా 15రోజులు అన్నీ బంద్…

దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. దీంతో అన్ని రాష్ట్రాలు, కర్ఫ్యూ, లాక్డౌన్ వంటి కఠిన చర్యలను తీసుకుంటుంది. ఈ జాబితాలో ఢిల్లీతో పాటు మరో రాష్ట్రం చేరింది. రాజస్థాన్లో ఈరోజు నుంచి 15 రోజల పాటు లాక్డౌన్ అమలు చేయనున్నారు. ఈరోజు నుంచి మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ఆంక్షలు రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉంటాయని ఆదివారం రాత్రి ఆ రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో అత్యవసర సర్వీసులు మినహా అన్ని ఆఫీసులు మూసి ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే నిత్యావసరాలకు సంబంధించిన షాపులు సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయని.. కూరగాయలు రాత్రి 7 వరకు అమ్మే అవకాశం కల్పిస్తున్నామని.. పెట్రోల్ పంపులు రాత్రి 8 గంటల వరకు బిజినెస్ చేసుకోవచ్చు నని ప్రభుత్వం తెలిపింది.
అంతేకాకుండా రాజస్థాన్ ప్రభుత్వ కొత్త ఆదేశాలతో.. షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు, సినిమా హాళ్లు, ఆలయాలు సైతం మూతపడనున్నాయి. అన్ని విద్యా కేంద్రాలు, కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు కూడా బంద్ లో ఉంటాయి. ఇంకా అన్ని కమర్షియల్ ఆఫీసులను మూసివేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బస్ స్టాప్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే ప్రయాణికులు టికెట్లు చూపించాల్సి ఉంటుందని.. లేని యెడల చర్యలు తప్పవని పేర్కొంది. ఇదే సమయంలో.. గర్భిణులు ఆస్పత్రులకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన సర్కార్.. వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్లేవారికి కూడా అనుమతి ఇచ్చారు. శుభకార్యలపై కూడా ఆంక్షలు ఉండగా.. పెళ్లి, అంత్యక్రియలకు 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే ఢిల్లీలో ఆరు రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయ తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *