మన మనస్సులోంచి ఆ పదాన్ని తొలగించాలి: నటి ఆండ్రియా
సినీ పరిశ్రమలో గాయనిగా కెరీర్ ప్రారంభించిన నటీమణి ఆండ్రియా. గాయనిగా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నటిగా మారిన విషయం తెలిసిందే. ‘యుగానికి ఒక్కడు’ ‘తడాఖా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
అయితే ఈ మధ్య నటి ఆండ్రియాకు కరోనా సోకింది. రెండు వారాల తర్వాత ఆమె కోలుకున్నారు. తాజాగా ఆమె కరోనా బారినపడిన వారికి కొన్ని సూచనలు చేశారు. అదేమంటే.. కరోనా అనే భయం మనస్సులో నాటుకుపోతే మరింతగా కుంగదీస్తుందని, ఎవ్వరూ కూడా భయం అనే పదానికి చోటివ్వరాదని సూచించారు. అంతేకాకుండా కరోనా వైరస్ గురించి వచ్చే నెగిటివ్ వార్తలను చూడటం మానుకొని కంటినిండా నిద్రపోవాలని ఆండ్రియా స్పష్టం చేయడం విశేషం.