భారీ రీమేక్ కి నో చెప్పిన సాయిపల్లవి..?

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా… పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. అయితే ఎంతో కాలంగా ఈ హిందీ రీమేక్ లో బెల్లంకొండ సరసన స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది సినిమా యూనిట్. అందులో భాగంగా ఇప్పటికే కియారా అద్వానీ, మరికొందరు బి-టౌన్ హీరోయిన్లను మూవీ టీం సంప్రదించింది. అయితే ఈ సినిమా కోసం ఒప్పించేందుకు మేకర్స్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా గానీ నటించేందుకు మాత్రం నారీమణులు తిరస్కరిస్తున్నట్లు సమాచారం అందుతుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం రౌడీ బేబీ.. సాయి పల్లవిని ఆశ్రయించారని తెలుస్తోంది అందుకు గానూ రూ.2 కోట్ల భారీ రెమ్యూనరేషన్ కు కూడా ఆఫర్ చేశారని సమాచారం. అయితే తన బిజీ షెడ్యూల్ తో కారణంగా సాయి పల్లవి ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ సినిమా కోసం ఏ హీరోయిన్ ను ఎంపిక చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. కాగా బెల్లంకొండ శ్రీనివాస్ ను 2014లో ‘అల్లుడు శీను’ సినిమాతో వివి వినాయక్ పరిచయం చేశాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘ఛత్రపతి’ రీమేక్ కావడం విశేషంగా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *