భారత్ కు రూ. 135 కోట్లు గూగుల్ సాయం
భారత్ లో కరోనా విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. రోజుకి 3లక్షల 50వేలకు పైగా కేసులు, 3వేలకు చేరువలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇండియా తీవ్రమైన సంక్షోభంలో పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇండియా మరింత డేంజర్ జోన్ లోకి పడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సమయంలో ఇండియాకు సహాయం చేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గూగుల్ ముందుకు వచ్చింది. ఏకంగా రూ.135 కోట్ల రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.
ముఖ్యంగా కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న గీవ్ ఇండియాకు, యూనిసెఫ్ కు ఈ ఫండ్ అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఇండియాకు సహాయమందించేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ వంటి దేశాలతో పాటు పాకిస్థాన్ కూడా ముందుకు వచ్చింది. కొవిషీల్డ్ టీకా తయారీకి అవసరమైన ముడి పదర్థాలను భారత్కు పంపాలని అమెరికా నిర్ణయించడం విశేషం. కాగా ఇండియాకు ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఫ్రాన్స్, బ్రిటన్ కూడా ఒక అడుగు ముందుకు వేసిన సాయం అందించనున్నట్లు వెల్లడించాయి.